మోడీ సర్వేలో కేసీఆర్ నెంబర్ 1.. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ను మొదటి స్థానంలో నిలిపి, దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా, ప్రధాని గుర్తించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో తెలుగు రాష్ట్రం, ఆంద్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సర్వేలో 13వ స్థానం దక్కింది. తాను అనుక్షణం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నప్పటికీ ప్రధాని తనకు ఐదో ర్యాంకు కేటాయించడం పట్ల చంద్రబాబు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ తర్వాతి స్థానాల్లో వరుసగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఈ నెల 16న ప్రధాని అధ్యక్షతన జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ ర్యాంకులను ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply