మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభం..

హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నది, గత కొన్ని దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ, మురికి కాలువగా మారి పొయింది. మూసీ నదిని ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ నగర ప్రజల అవసరాలు కొద్దివరకైన తీరుతాయి. మూసీ నది రూపురేఖలు మార్చాలని, సుందరీకరణ పనులు చేపట్టాలని  తెలంగాణ పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా అర్బన్ ఫారెస్ట్రీ విభాగం విధి విధానాలు రూపొందించింది. అందులో భాగంగా మొదట ఉప్పల్ భగయత్ సమీపంలోని మూసీ నది తీరంలో మూడున్నర కిలోమీటర్లు సుందరీకరణ పనులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఒక కిలోమీటర్ పనులకు మూడు కోట్ల మేర ఖర్చు అంచనా అవుతుందని ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే మూసీ తీరం వెంట మొక్కలు పెంచటం, వాక్ వేలు నిర్మించటం చేస్తారు. ఈ పనులు గనుక పూర్తయితే మూసీ నది సరికొత్త సొబగులు సంతరించుకొని, నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.

Leave a Reply