కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్ రావు…

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆదిలాబాద్ లో రైతు గర్జన నిర్వహించాలని చూస్తున్నారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులను బ్రష్టు పట్టించి, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని హరీష్ రావు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆని విధాలుగా రైతులను ఆదుకుంటుందని హరీష్ రావు తెలిపారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణి చేస్తామని, రైతుల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని హరీష్ రావు వెల్లడించారు.

Leave a Reply