అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి..

తెలంగాణ రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అర్ధరాత్రి సమయంలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. పురపాలిక శాఖ మంత్రి హోదాలో అర్ధరాత్రివేళ హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. రాత్రి 11 గంటల నుండి 2.30 గంటల వరకు పంజాగుట్ట, అమీర్ పేట, కుకట్ పల్లి, కేపీహెచ్బీ, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించారు.పంజాగుట్ట ప్రాంతంలో చిన్నారి రమ్య మృతికి కారణమైన ప్రదేశాలను కేటీఆర్ పరిశీలించారు. పలు ప్రాంతాల్లో రోడ్డుపై నీరు నిలిచి ఉండడంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచి వారం రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. బస్ స్టాప్ ల దగ్గర ప్రయాణికులు కూర్చోవడానికి అనుకూలంగా నిర్మాణాలు జరగాలని కేటీఆర్ సూచించారు. మరో వారం రోజుల పాటు ఇలాగే ఆకస్మిక పర్యటనలు చేస్తానని, అధికారులందరూ నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయాలని కేటీఆర్ స్పష్టంచేశారు.

Leave a Reply