దళారీల ప్రమేయం లేకుండా పేదలకు రుణాలు అందేలా చర్యలు తీసుకోండి…

తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్న, జగదీశ్వర్ రెడ్డి, చందూ లాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ, మైనార్టీ,ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలకు,స్వయం ఉపాధి పథకాల కోసం ఇస్తున్న రుణాలపై మంత్రులు సమీక్ష కోరారు. ఈ సందర్భంగా ఎలాంటి షరతులు లేకుండా స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను మంత్రులు కోరారు. క్షేత్ర స్థాయిలో అధికారులు సహకరించడం లేదని తమ దృష్టికి వచ్చింది అని, అవసరమైతే నిబంధనలు సవరించైనా సరే దళారీల ప్రమేయం లేకుండా పేదలకు రుణాలు అందేలా చర్యలు చేపట్టాలని బ్యాంకర్లను మంత్రులు సూచించారు.

Leave a Reply