సెంచరీకి చేరువలో తెలంగాణ రాష్ట్ర సమితి..

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీకి 63 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. బొటాబొటి మెజారిటీతో మాత్రమే తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసించి. ఐతే ఆ తర్వాత జరిగిన భారి వలసలతో ప్రస్తుతం ఆ పార్టీలో 90 మంది శాసనసభ్యులు ఉన్నారు. అంటే 27 మంది వేరే పార్టీల ఎమెల్యేలు తెరాసలో చేరారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వలసలు జరగలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకో పది మంది ఎమెల్యేలు చేరితే తెరాస సెంచరీ కొట్టడం ఖాయం. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో తెరాసకు 90, కాంగ్రెస్ కు 13, ఎంఐఎంకు 7, బిజెపి 5, టిడిపి ౩, సిపిఎం తరపున ఇద్దరు శాసనసభ్యులు మిగిలారు. మరింత మంది కాంగ్రెస్ ఎమెల్యేలు పార్టీ మారటం ఖాయం అని ప్రచారం జరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అలవోకగా సెంచరీ కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply