ఒక్క రోజు మాత్రమే జరగనున్న సమావేశం..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నేడు సమావేశం జరగనుంది. సమావేశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావులు స్పీకర్ మధుసూధనా చారితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ఆమోదించిన జీఎస్టీ బిల్లును శాసనసభలో ఆమోదించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కోరడంతో శాసన సభ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. దేశ వ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును లోక్ సభలో ఆమోదించింది. అయితే ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలు జరగాలంటే 15-16 రాష్ట్రాల శాసన సభల ఆమోదం తప్పనిసరి. ఇది వరకు 10 రాష్ట్ర శాసన సభలు బిల్లును ఆమోదించాయి. తెలంగాణ రాష్ట్రం బిల్లు ఆమోదించిన 11వ రాష్ట్రం అవుతుంది. నిన్న ప్రత్యేకంగా సమావేశం అయిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ఆమోదం తెలిపింది. కాగా ఈ బిల్లు గనక అమలులోకి వస్తే తెలంగాణకు ప్రతి ఏట 30000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.

Leave a Reply