టీడీపీ నేతలకు కూడా అతనితో సంబంధాలు…?

రెండు రోజుల క్రితం పోలిసుల ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీంకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతనికి అనేక పార్టీల వ్యక్తులతోటి సన్నిహిత సంబంధాలుండేవని తెలుస్తుంది. అందులో కొంతమందికి నయీం రకరకాలుగా సాయం చేసేవాడని అందుకు ప్రతిఫలంగా భారిగా డబ్బు తీసుకునేవాడని తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికి నయీంతో సత్సంబంధాలు ఉండేవని వార్తలు వచ్చాయి. ఐతే దీనిపై మాధవరెడ్డి కుమారుడు సంజీవ్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్ నయీంకు మా కుటుంబానికి  ఎటువంటి సంబంధం లేకున్నా కొంతమంది మీడియాకు లీకులు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని సందీప్‌రెడ్డి అన్నారు. నయీం అక్రమాలపై న్యాయ విచారణ జరిపి నిజానిజాలు బయటకు తేవాలని  ఆయన కోరారు. అంతే కాకుండా గతంలో నయీమ్‌తో సత్సంబంధాలు ఉన్న వారంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరారని ఆయన పేర్కొన్నారు. 2004 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎక్కడ  భూదందాలు, మనీ సెటిల్‌మెంట్లు లేవని ఆయన తెలిపారు. 2004 అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి దందాలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల మా కుటుంబానికి గాని,  టీడీపీకి గాని నయీంతో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును సిట్‌కు కాకుండా సీబీఐ విధించి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే  కొంత మంది టీడీపీ నేతలకు  కూడా నయీంతో సంబంధాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply