ఆర్టీసీకి నష్టాలు అందుకే..!

తెలంగాణలో ఆర్టీసీ భారి నష్టాల్లో నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష కూడా నిర్వహించారు. అయితే ఆర్టీసీ నష్టాలపై మహబూబ్ నగర్ ఎమెల్యే శ్రీనివాస్ గౌడ్ కొత్త వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజనతో మంచి బస్సులు అన్ని ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళాయి అని అందుకే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని ఆయన వివరణ ఇచ్చారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆర్టీసీని ఆదుకోవాలని మాట్లాడలేదని, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారన్నారు. గతంలో ప్రభుత్వాలను మార్చిన శక్తి ఆర్టీసీ కార్మికులదని  శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆంధ్రా నాయకులకు అందరికీ బస్సుల కంపెనీలే ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టే సిటీ బస్సులను జీహెచ్‌ఎంసీకి అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఆర్టీసీలో పని చేసే ప్రతి కార్మికునికి భూములను కేటాయించి దాంట్లో డబుల్‌ బెడ్‌రూమ్‌లను కట్టించేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

Leave a Reply