అందుకే హై కోర్ట్ విభజనకు అడ్డు పడుతున్నారు..!

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించిన ఉమ్మడి హై కోర్ట్ విభజన, న్యాయాధికారుల ఆప్షన్ విధానం తీవ్రంగా వివాదాస్పదమవుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా తెలంగాణ నేతలంతా మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశారు. అయితే కేంద్ర న్యాయ శాఖా మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ విభజనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరించడం లేదని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా తెలంగాణ నేతలంతా చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ఎంపి కవిత మాట్లాడుతూ హై కోర్ట్ విషయంలో కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నప్పటికి చంద్రబాబు విభజన జరగకుండా అడ్డం పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగినందు వల్ల తెలంగాణను పరిపాలించేందుకు చంద్రబాబు అడ్డ దారులు తొక్కుతున్నారని కవిత ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం, కేంద్రంలోని కొందరు పెద్దలు కూడా కోర్ట్ ద్వారా తెలంగాణను పరిపాలించేందుకు కుట్ర చేస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply