ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ తెరాస ఎంపీ కవిత

మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతంపై తెరాస ఎంపీ కవిత స్పందించారు. కేసీఆర్ ఒక చోట నీటిని ఒడిసిపట్టి మరో చోట వదిలేసే విధానం అవలంభిస్తున్నారని, మహారాష్ట్రతో ఒప్పందం ద్వారా కేసీఆర్ కాళేశ్వరం దగ్గర వదిలిన నీటిని మేడిగడ్డ దగ్గర ఒడిసి పట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు అని తెలిపారు. రేవంత్ రెడ్డి అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందుకు ఆయన తెలంగాణ మ్యాప్ కూడా మర్చిపోయారని, ఆయన తెలుగుదేశం పార్టీకి వర్క్ లేని ప్రెసిడెంట్ గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. మరో తెదేపా నేత ఎల్. రమణ మహారాష్ట్రలో భూములు ముంచి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలని కేంద్రానికి లేఖలు రాశారని, అలాగైతే రాష్ట్రంలో ఎప్పటికి ప్రాజెక్టులు కట్టలేమని పేర్కొన్నారు. తెరాస ఒప్పందాన్ని చేసుకొస్తే భాజాపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, వాళ్ళు నిజంగా సంబరాలు చేసుకోవాలంటే తెలంగాణలో ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకువచ్చి సంబరాలు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply