తెలంగాణ భవిష్యత్ కార్యాచరణను రూపొందించే అవకాశం..

తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల టీఆర్ఎస్ఎల్పి సమావేశం కానుంది. టీఆర్ఎస్ కు చెందిన ఎమెల్యేలు,ఎమెల్సీలు, పార్లమెంట్ సభ్యులు సమావేశం అవుతున్నారు. జిల్లాల పునర్విభజన, మిషన్ కాకతీయ, మిషన్ భాగిరథ, హై కోర్ట్ విభజన, మల్లన్న సాగర్ వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. హెచ్ఐసీసీలో ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకునరసాపురం ప్రారంభం అవనున్న ఈ సమావేశం సుదీర్ఘంగా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి మరియు టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.

Leave a Reply