విద్యా వాలంటీర్ల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం..

పాఠశాల విద్య మెరుగుపడే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 9,335 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై సిఎం చర్చించారు. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా తాత్కాలిక నియామక పద్దతిలో విద్యా వాలంటీర్లను  ఎంపిక చేయనున్నారు. టి.ఎస్.పి.ఎస్.సి. ద్వారా నియామకమయ్యే రెగ్యులర్ టీచర్లు వచ్చేవరకు వీరు తాత్కాలికంగా కొనసాగుతారు. వీరి నియామకం ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టడం జరుగుతున్నది.

Leave a Reply