తెలంగాణకు రెండు ఇండస్ట్రియల్ కారిడార్లు..

తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు ఇండస్ట్రియల్ కారిడార్లు రాబోతున్నాయి. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపించిన ప్రతిపాదనలను కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించారు. రాష్ట్రం పంపించిన ప్రతిపాదనల ప్రకారం హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్ ఇక ఇండస్ట్రియల్ కారిడార్లుగా అభివృద్ధి చెందబోతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఆయిల్ రీఫైనింగ్, టెక్స్ టైల్, చేనేత పరిశ్రమలు, పేపర్ పరిశ్రమలు, మైనింగ్, ఇంజనీరింగ్, పౌల్ట్రీ, చేతి వృత్తులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఐతే ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదించాల్సి ఉంది. కేంద్ర మంత్రి వర్గ ఆమోదం పొందడం ఇక లాంఛానమే అని తెలుస్తుంది.

Leave a Reply