పెట్టుబడుల ఆకర్షణకు మరో ముందడుగు వేసిన కేంద్రప్రభుత్వం

దేశంలో అత్యంత కీలకమైన రక్షణ రంగం, విమానయాన రంగం, ఫార్మా రంగాలకు సంబంధించిన అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాన్ని అనూహ్యంగా మోదీ సర్కారు ప్రకటించింది. రక్షణ రంగంలో 100 శాతం వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, అలాగే విమానయాన రంగంలోనూ 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు,ఫార్మా రంగంలోకి 74 శాతం విదేశీ ప్రభుత్వ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు సోమవారం భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఈ రంగాల్లో  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 49 శాతం వరకు ఉండేది. దీనిని ఒకేసారి 100 శాతం వరకు అంటే 51 శాతం పెంచడం  ఇదే మొదటిసారి. ఈ నిర్ణయంతో వివిధ విదేశీ ఆయుధ కంపెనీలకు భారత్ కు పెట్టుబడుల కోసం వరుసకట్టే అవకాశం ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేసిన బీజేపీ ఇప్పుడు చడీచప్పుడు కాకునా ఎందుకు ప్రకటన విడుదల చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Leave a Reply