భగత్ సింగ్ రాజ్ గురులను కూడా ఉరి తీశారు..

స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లను ఉరి తీశారంటా. ఈ మాట అంటున్నది ఎవరో కాదు సాక్షాత్తు భారత విద్యా శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. మధ్యప్రదేశ్ లోని చింద్ వారాలో జరిగిన తిరంగా యాత్రలో పాల్గొన్న జవదేకర్, అక్కడ మాట్లాడుతూ 1857 నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడితే 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని, ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, మరికొంత మందిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిందని తెలిపారు. ఉరి తీయబడ్డ వారిలో జవహర్ లాల్ నెహ్రు, వల్లభాయి పటేల్, సుభాష్ చంద్ర బోస్, రాజ్ గురు, భగత్ సింగ్ లు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నెహ్రు తన 74వ ఏట, సర్దార్ పటేల్ 75వ ఏట సహజ మరణం పొందారు. సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికి మిస్టరీగానే ఉండిపొయింది.

Leave a Reply