ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఎస్సార్‌ గ్రూప్‌ పది పదిహేను సంవత్సరాల క్రితం దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకుల వ్యక్తిగత ఫోన్లను ట్యాప్‌ చేసినట్లుగా వచ్చిన వార్తలు సంచలనాత్మకంగా మారాయి. ఆరోపణలను న్యాయవాది సురేన్‌ ఉప్పల్‌ అందుకు సాక్ష్యంగా తన క్లయింట్‌ అందజేసిన పలు రాతప్రతులను, ఆడియో టేప్‌లను కూడా బయటపెట్టారు. ఎస్సార్‌ గ్రూప్‌ కు చెందిన యాజమాన్యం ప్రశాంత్ రుయా,రవికాంత్ రుయా, శశి రుయా ఆదేశాలపై ఎస్సార్‌ టెలికామ్‌ సంస్థలో పనిచేసిన తన అల్‌బసీత్ ఖాన్‌ ఈ ట్యాపింగ్‌ వ్యవహరాన్ని నడిపించినట్లుగా  సురేన్‌ ఉప్పల్‌ పేర్కొన్నారు. ట్యాపింగ్‌, ఫోన్ సంభాషణల రికార్డింగ్‌కు సంబంధించిన ఆధారాలు అందులో ఉన్నట్లుగా తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారిలో ప్రస్తుత కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, సురీష్ ప్రభు లు ఉన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన ముఖేష్ అంబాని, అనిల్ అంబాని, సిని నటుడు అమితాబ్ వంటి ప్రముఖులు, సమాజ్ వాది నేత అమర్ సింగ్, బిజేపి నేత జశ్వంత్ సింగ్  అలాగే 2001-2006 మధ్య ప్రధాని కార్యాలయంలో పని చేసిన వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారు.

Leave a Reply