హరీష్ రావు మంచోడు అనుకున్నా, కాని..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావు, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు 4 గ్రామాల ప్రజలను లేపితే తాను 400 గ్రామాల ప్రజలను లేపుతా అని హరీష్ రావు అనడం సమంజసం కాదని వీహెచ్ అన్నారు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావని ఆయన పేర్కొన్నారు. ఇంకా వీహెచ్ మాట్లాడుతూ తాను హరీష్ రావును మంచివాడు అనుకున్నాను అని, రైతులు భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయం అడుగుతుంటే, హరీష్ రావు ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఆరోపించాడు. మంత్రి పదవులను, కాంట్రాక్టులను ఆశగా చూపి, విపక్ష ఎమెల్యేలను, ఎంపిలను చేర్చుకుంటున్నారు అని ఇది రాజ్యాంగ విరుద్ధం అని వీహెచ్ అన్నారు. తెలంగాణను ఇచ్చింది సోనియాగాంధీ అని కెసిఆర్ గుర్తించుకోవాలని వీహెచ్ హితవు పలికారు.

Leave a Reply