కాంగ్రెస్ లో ఎందుకు చేరానంటే..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్, మాజీ ఎంపి విజయశాంతిపై చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. ఎన్నికల సమయంలో విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకున్నారు అని ప్రశ్నించిన కెసిఆర్ కు ఆమె సమాధానం ఇచ్చారు. తనను 2013 జూన్ నెల లోనే తెరాస నుండి సస్పెండ్ చేశారని, ఆ తర్వాత 8 నెలలకు తాను కాంగ్రెస్ లో చేరినట్లు విజయశాంతి పేర్కొన్నారు. తనపై అబద్ధపు ప్రచారాన్ని, కుట్రలు చేసి తనను పార్టీ నుండి సస్పెండ్ చేసేటట్లు కొంత మంది చేశారని విజయశాంతి వివరించారు. సుదీర్ఘ కాలం కెసిఆర్ తో కలిసి ఉద్యమంలో పని చేశాను అని, ఇప్పటికి తనకు కెసిఆర్ అంటే ఎంతో గౌరవం ఉందని విజయశాంతి తెలిపారు.

Leave a Reply