వాళ్ళకో రూల్ .. వీళ్ళకో రూల్ .. తప్పు కాదా?

జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును చెప్పుతో కొట్టండి అని అన్నందుకు టిడిపి నేతలు అంతెత్తు ఎగిరి పడుతున్నారు. ఇప్పుడు వారు రాజకీయాల్లో విలువల గురుంచి మాట్లాడుతున్నారు. అయితే గతంలో తెదేపా నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఏ విధంగా విమర్శించాడో తెలుగుదేశం నేతలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను బట్టలిప్పదీసి కొట్టండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేతలు వీరుడు,శూరుడు,పులిబిడ్డ అంటూ పొగిడారు. అదే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యక హోదా తీసుకురాకుంటే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పుల్తో కొట్టండి అంటూ వ్యాఖ్యానించాడు. ఇందులో జగన్ చంద్రబాబాను వ్యక్తిగతంగా ఏమి దూషించ లేదు, కేవలం రాష్ట్రానికి ప్రత్యక హోదా తీసుకురావడానికి చంద్రబాబు ఏమి చేయడం లేదనే అసహనంతో అన్నాడే తప్ప మరో కారణం లేదు. దీనికి తెలుగుదేశం నేతలు అంతలా ప్రతిస్పందించడం అవసరం లేదు. మరి రేవంత్ ముఖ్యమంత్రిని స్థాయికి మించి దూషించడం తప్పు కానప్పుడు జగన్ చంద్రబాబును విమర్శించడం ఎలా తప్పు అవుతుంది…?

 

Leave a Reply