సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా…

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాన్ గత ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించి, ఎన్డీయే కూటమికి మద్దతు పలికి రాష్ట్రంలో ఆ కూటమి అధికారంలోకి రావడానికి సహకరించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల వాగ్దానంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్డీయే కూటమి పేర్కొంది. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ప్రత్యేక హోదా ఊసే లేదు. దాంతో ఎన్డీయే కూటమితో పాటు పవన్ కళ్యాన్ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కే. రోజా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాన్ సినిమాలలో మాత్రమే గబ్బర్ సింగ్ అని, రాజకీయాల్లో మాత్రం ఆయన రబ్బర్ సింగ్ అని ఆమె విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని రోజా డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని పేర్కొన్న పవన్ కళ్యాన్ మరిప్పుడు ప్రత్యేక హోదా పై ఎందుకు ప్రశ్నించడం లేదని, రాజకీయాల్లో ఆయన చేతులెత్తేశారని విమర్శించారు.

Leave a Reply