చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదా..?

వైఎసార్సిపి శాసనసభ్యురాలు రోజా మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనపై రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా మాట్లాడిన రోజా చంద్రబాబు ఈ రెండేళ్లలో చేసింది ఏమి లేదన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ గుడిని,గుడిలోని లింగాన్ని మింగేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని, తెలుగుదేశం పార్టీ నాయకులే మహిళలపై తోడేళ్ళలాగా పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగా లేదని అందుకే పెగ్గులు తాగండి, పేక ఆడండి, చెక్క భజనలు చేయండి అంటున్నారని, ఇక చంద్రన్న పెగ్గులు,చంద్రన్న పేకలు,చంద్రన్న చెక్కలు వంటి పథకాలను ప్రవేశపెడతారేమోనని ఎద్దేవా చేశారు. అవినీతి అనకొండ చంద్రబాబు అని, కమిషన్ల కొడచిలువ లోకేష్ అని వ్యాఖ్యానించారు. సినిమాల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అయితే రాజకీయాల్లో లోకేష్ కలెక్షన్ కింగ్ అని విమర్శించారు.

Leave a Reply