అవునా? ఇది నిజమేనా?

దేశమంతా సింధు సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తూ తనని గొప్ప క్రీడాకారిణిగా అభినందిస్తూ తన విజయం ప్రతి భారతీయుడి విజయం అని గర్వపడుతున్నారు.అయితే ఈ విజయానికి కారణం ఎవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఎందుకంటే తన విజయానికి తొలినుంచి కోచ్ గా ఉంటూ తన గెలుపుకు ప్రధాన సాక్షిగా నిలిచిన పుల్లెల గోపీచంద్.బాడ్మింటన్ లో తొలినుంచి రాణిస్తూ వస్తున్న గోపీచంద్ కు మొదట అంత సహకారం లేకపోయినప్పటికీ 2001లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచాక అప్పటి ప్రభుత్వం నుండి మద్దతు లభించింది.ఒక మంచి ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆశించిన పుల్లెల గోపీచంద్ కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో 5 ఎకరాల పొలం ప్రభుత్వం తరపున సాధారణ ధరకే లీజుకు ఇచ్చారు.అయితే అప్పుడు బాడ్మింటన్ అకాడమీ నెలకొల్పేందుకు పూర్తి స్థాయి ఆర్ధిక సహకారం లేకపోవడంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సహకారంతో స్థాపించి శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టారు.అనంతరం తన శిష్యురాలైన సైనా నెహ్వాల్ విజయం తర్వాత గోపీచంద్ అకాడమీ ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది.అయితే నిన్న సింధు గెలిచిన అనంతరం అభినందనలు తెలుపుతూ ఎపి సిఎం చంద్రబాబు ఇదే విషయాన్నీ ప్రస్తావించారు.అయితే కేవలం అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహమే ఈ విజయాలన్నింటికి కారణం అని చెప్పలేము.అకాడమీ స్థాపించడానికి ఆర్ధికంగా సహకరించిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అభినందించి తీరాలి.అలాగే రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక క్రీడా విధానంతో క్రీడాకారులకు ప్రోత్సాహాలు,సానియా మీర్జా వంటి మేటి క్రీడాకారిణిని బ్రాండ్ అంబాసిడర్ గా చేసి పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలపాల్సిందే. ప్రపంచం నలుదిక్కుల తెలుగు వారి సత్తాను చాటిచెప్పిన సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ కు శుభాభినందనలు.ఎప్పటికి ఇలాంటి విజయాలు భారతమాత మోముపై ఆనందాన్ని చిగురించేలా చేయాలంటే కేవలం క్రికెట్ వంటి ఆటలకే పరిమితం కాకుండా ప్రతి క్రీడని ప్రోత్సహిస్తే అన్నిటా విజయభేరి మోగించవచ్చని సింధు రుజువు చేసింది.

Leave a Reply