ఉతికిన బట్టలని మడతపెట్టేందుకు మెషిన్

మనం మనుషులం కదా.. తెలివితేటలు మిగతా జంతువులతో పోలిస్తే చాలా ఎక్కువే.. అందుకే నిప్పురవ్వ తో మొదలుకుని భాష..సమాచార వ్యవస్థ.. చక్రం..వాహనం..విద్యుత్.. ఇలా ప్రతిది అవసరానికి సౌకర్యానికి ఆలోచనలకూ పదునుపెడుతూ కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాం.. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్ వాడుతున్నాం.. ఇక ఉతికాక వాటిని మడత పెట్టడం కాస్త కష్టమైన పనే అయినప్పటికి చేయక తప్పడు కదా.. కానీ ఇప్పుడు ఆ అవసరం ఇకపై లేనట్లే కనిపిస్తున్నది ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నడులేని లేని విధంగా బట్టలను మడతేసేందుకు ప్రత్యేకంగా ఒక మెషీన్ ని తయారుచేసింది.ఫోల్దిమేట్ అనే ఈ రోబోటిక్ పరికరం విస్తృత ప్రచారాన్ని పొందుతుంది. 2018 లో ఈ పరికరాన్ని మార్కెట్ లోకి తీసుకురానున్నారు. ఈ పరికరం ధర 700-800డాలర్ల ఉండే అవకాశం ఉంది.

Leave a Reply