ప్రమాదంలో కోట్ల ఫోన్లు…

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మొబైల్ ఫోన్ లలో ఉన్న ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్. వాటిలో చాల వరకు ‘క్వాల్ కాం’ ప్రాసెసర్ ద్వారా నడుస్తున్నవే అయితే క్వాల్ కాం ప్రాసెసర్ ద్వారా నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ లకు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఇంటర్నెట్ వినియోగించేటప్పుడు యాడ్ ఏంటో చూసుకోకుండా యాడ్ పై గనుక క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. ప్రమాదకరమైన వైరస్ ‘క్వాడ్ రూటర్’ ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడి, డాటాను దొంగిలిస్తుంది. ఇది ఫోన్ లోకి ఇన్ స్టాల్ అవడానికి ఎటువంటి పర్మిషన్ లు అవసరం లేదు. ఒక్క సారి ఇది ఇన్ స్టాల్ అయితే ఇక మన ఫోన్ హ్యాకర్ల చేతిలో పడ్డట్లే. మన ఫోన్ సంభాషణలు, ఆడియోలు, వీడియోలు, జీపీఎస్ మొదలైన సమాచారం అంతా మన నియంత్రణలో లేకుండా పోతాయి. కనుక మీది ‘క్వాల్ కాం’ ప్రాసెసర్ ద్వారా నడిచే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే జాగ్రత్తగా వినియోగించడం మంచిది.

Leave a Reply