తుని ఘటనపై సిఐడి సంచలన రిపోర్ట్

తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అధ్వర్యంలో గతంలో కాపు గర్జన జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఉన్నపళంగా హింస చెలరేగింది. దానిపై విచారణ జరిపిన సిఐడి అధికారులు విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. సిఐడి అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం కాపు సభలో ఆ వర్గం కార్యకర్తలు రెచ్చిపోవడంతో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని, అందుకు వారిని ప్రేరేపించినది ముద్రగడేనని ఆ నివేదికలో పేర్కొన్నారు. తుని కుట్రకు పూర్తి బాధ్యత ముద్రగడేనని స్పృష్టం చేసింది.ముద్రగడ వ్యాఖ్యలతో ఆందోళనకారులు రెచ్చిపోయారు అని, కొందరు ఆందోళనకారులు కుట్రపురితంగానే సభకు ఆయుధాలు, డీజిల్, పెట్రోల్ తీసుకువచ్చారు అని సిఐడి అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

Leave a Reply