విమానాలపై విన్నూత్న ప్రచారం..

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం ఆగష్టు 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్ చిత్రానికి విన్నూత్న రీతిలో ప్రచారాన్ని కల్పించేందుకు సిద్దం అయింది. అందులో భాగంగా విమానాలపై కబాలి పోస్టర్లను ముద్రిస్తారు. అందుకోసం ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఈ తరహా ప్రచారం హాలీవుడ్ చిత్రం ‘ది హాబిట్’ కు మాత్రమే చేశారు. ఇప్పుడు కబాలి ఆ గౌరవాన్ని అందుకోబోతుంది.

Leave a Reply