‘ఓం నమో వేంకటేశాయ’ నాగార్జున ఫస్ట్ లుక్..

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడుడు రాఘవేంద్ర రావు దర్శకత్వలో హాథీరాం బాబాగా నటిస్తున్న భక్తి రస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అన్నమయ్య, శ్రీ రామదాసు వంటి భక్తి రస చిత్రాలు అందించారు. ఇప్పుడు మరో సారి జతకట్టారు. అనుష్క, ప్రజ్ఞ్యా జైస్వాల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ హిందీ సీరియల్ యాక్టర్ సౌరభ్ రాజ్ వెంకటేశ్వర స్వామిగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సాయి కృపా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గతంలో ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న సౌరభ్, అనుష్కల ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం, ఇప్పుడు తాజాగా నాగార్జున ఫస్ట్ లుక్ నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.

om namo venkateshaya

Leave a Reply