ఎందుకంటే…?

ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ అంటే తెలియని వారు ఉండరు. దీని ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అదే స్థాయిలో దుస్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పరిక్షల సమయంలో విద్యార్థులు ఫేస్ బుక్ వాడటం ద్వారా ఎంతో విలువైన తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దీనిని గుర్తించిన అల్జీరియా దేశం తమ దేశంలో విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి అని ఫేస్ బుక్ ను బ్యాన్ చేయడం సంచలనం సృష్టిస్తుంది. శని వారం నుండి బ్యాన్ చేశారు. ఈ నెల 23 వరకు నిషేధం అమల్లో ఉంటుంది. ఫేస్ బుక్ తో పాటు ట్విట్టర్, ఇంస్టాగ్రాం వంటి సామాజిక అనుసంధాన వేదికలను కూడా నిషేధించారు.

Leave a Reply