సెల్ఫీ రాజా ఫస్ట్ లుక్

అల్లరి నరేష్ ఒకప్పుడు కడుపుబ్బా నవ్వించే సినిమాలతో హిట్లు కొడుతూ, నిర్మాతల పాలిట మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు. అయితే గత కొత్త కాలంగా అల్లరి నరేష్ నటించిన సినిమాలేవి విజయం సాధించలేకపోయాయి. దాంతో ఇప్పుడు ఎలాగైనా ఖచ్చితంగా హిట్టు కొట్టాలని ‘సెల్ఫీ రాజా’ గా వస్తున్నాడు. తనకు సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో విజయాన్ని అందించిన జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మళ్ళి నటిస్తున్నాడు. గతంలో అల్లరి నరేష్ విజయ్ మాల్యాతో దిగిన సెల్ఫీతో సినిమా పేరును ప్రకటించిన చిత్ర బృందం, తాజాగా దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ జయంతిని పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది.

selfie raja first look

Leave a Reply