ఆదర్శంగా నిలుస్తున్న టాలీవుడ్ తారలు..

టాలీవుడ్ తారలు సినిమాల్లో నటిస్తూ డబ్బు సంపాదించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర కథానాయికలైన కాజల్ అగర్వాల్, సమంతలు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు వారి సరసన రెజినా కూడా చేరిపోయారు. సమంత ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతుగా సేవ చేస్తుంది. అంతే కాకుండా తన తదనంతరం తన కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చింది. సమంత బాటలోనే కాజల్ అగర్వాల్ కూడా తన కళ్ళను దానం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా యువ కథానాయిక రెజినా కూడా తన కళ్ళను దానమివ్వబోతున్నట్లు ప్రకటించింది. సీనియర్ కథానాయికలైనా త్రిష, స్నేహలు తమ కళ్ళను దానమిస్తున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అలాగే లోక నాయకుడు కమల్ హసన్ కూడా తన అవయవాలను దానం ఇస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply