టీడీపీ, బీజేపీ తీరుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎసార్సీపీ నేడు తలపెట్టిన బంద్ కు ప్రజల నుండి అనూహ్య మద్దతు లభించింది. ప్రజలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు. ప్రజా సంఘాలు, యువజన సంఘాలు,వ్యాపారస్తులు స్వచ్చందంగా బంద్ కు మద్దతు తెలిపారు. పలు చోట్ల ఆర్టీసీ సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ,టీడీపీ అనుసరిస్తున్న వైఖరీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసన తెలిపారు. కాంగ్రెస్, వాపపక్ష పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు పోరాడుతుంటే మద్దతు ప్రకటించాల్సింది పోయి, అధికార టీడీపీ నేతలు బంద్ ను విచ్చిన్నం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకోమని పోలీసులకు మౌకికంగా ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంద్ ను విఫలం చేయడానికి టీడీపీతో కలిసి ప్రయత్నించిన పోలీసులపై కూడా విమర్శలు వచ్చాయి.

Leave a Reply