దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆస్తి 44లక్షలేనని చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం ఆయన లక్షల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అయితే భారత ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వారు మాత్రం చంద్రబాబు దేశంలోనే అత్యంత ఆస్తి కలిగిన ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు ఆస్తుల విలువ 177 కోట్ల  48 లక్షల 95 వేల 611 రూపాయలు. ఇందులో స్థిరాస్తులు మొత్తం 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయలు, చరాస్తుల విలువ 42 కోట్ల 68 లక్షల 8 3 వేల 883 రూపాయలు. చంద్రబాబుతరువాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంతి పెమాఖండూ, మూడో స్థానంలో జయలలిత ఉన్నారు.చంద్రబాబు తరచుగా తాను రెండెకరాలు ఉన్న కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటారు. అయితే రెండెకరాల నుండి ఇన్ని వందల కోట్లు ఎకరాలు ఎలా సంపాదించారో అందరికి వివరిస్తే బాగుంటుంది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయనలా ఇంకొకరు ఎదిగే అవకాశం కల్పించిన వారు అవుతారు.

Source of data: ADR India

Leave a Reply