ప్రపంచంలోనే అతి భయంకరమైన రోడ్..

మనం సాధారణంగా సురక్షిత ప్రయాణానికి మనం సాధారణంగా రోడ్డు ప్రయాణానికి మొగ్గు చూపుతాం. అయితే ఇక్కడ వీడియోలో కనిపిస్తే రోడ్డుపై ప్రయాణిస్తే మాత్రం గుండెలు అదిరిపోవడం ఖాయం ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా ప్రసిద్ధి చెందింది. ఈ రోడ్డు నార్వే దేశంలో ఉంది. దాని పేరు అట్లాంటిక్ ఓషన్ రోడ్ లేక అట్లాంటిక్ రోడ్. 8.3 కీ.మీ పొడవు ఉన్న ఈ రోడ్డు నార్వే దేశానికి చెందిన దీవులైన అర్చిపెలేగో మరియు అవేరోయ్ లను కలుపుతుంది. అనేక చిన్న చిన్న దీవులను ఆధారంగా చేసుకొని నిర్మించిన ఈ రోడ్డు నిత్యం సముద్ర అలల తాకిడికి గురి అవుతుంది. ఎగిసి పడే అలలు కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కుడా కారణం అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ అడుగడుక్కి ఒక గండం, ఎంతో నేర్పుతో జాగ్రత్తగా నడిపితే తప్ప అవతలి వైపుకు చేరుకుంటాం లేదంటే ఇక పైకి తప్ప ఎటుపోలేము.

 

Leave a Reply