షాక్: షూటింగ్ స్పాట్ లో గాయపడ్డ బాలకృష్ణ..!

నందమూరీ నట సింహం బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివలే మొరాకోలో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వచ్చిన ఆ చిత్ర బృందం, ఇప్పుడు హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర వేసిన ఓడ సెట్లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే షూటింగ్ లో హీరో బాలకృష్ణ గాయపడ్డట్లు సమాచారం. యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో ఆయన గుర్రం పై నుండి కింద పడ్డట్లు తెలుస్తుంది. అయితే కేవలం బాలకృష్ణకు చిన్న,చిన్న గాయాలు మాత్రమే తగిలాయని,ఫ్రాక్చర్ కాలేదని సమాచారం.

Leave a Reply