టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న క్రేజీ కాంబినేషన్..!

తెలుగు చలన చిత్రాల్లో సరికొత్త మల్టీ స్టార్ మూవీకి రంగం సిద్ధం అయ్యింది. ఎవరూ ఉహించని కాంబినేషన్ ను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సృష్టించబోతున్నారు. మాస్ జనాల్లో భారి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలైన మహేష్ బాబు, బాలకృష్ణ కలిసి నటించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. గతంలో బాలకృష్ణ, మహేష్ బాబులు విడివిడిగా మల్టీ స్టార్ మూవీలో నటించినా, ఇప్పుడు మాత్రం కలిసి నటించబోతున్నారు.  అయితే ఈ వార్తలపై బాలకృష్ణ, మహేష్ బాబు ఎవరు ఖండించలేదు. ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ తో, బాలకృష్ణ తన వందవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తైన వెంటనే ఈ క్రేజీ కాంబినేషన్ ముందుకు రానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాబోతుంది..

Leave a Reply