అగ్ర దేశాల మద్దతు కోరిన బాలుచిస్థాన్ ..

పాకిస్థాన్ లో స్వేచ్చా వాయువుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బాలుచిస్థాన్ ప్రజలకు భారత దేశ ప్రధాని బహిరంగంగా మద్దతు ప్రకటించడం అక్కడి ప్రజల్లో సంతోషాన్ని నింపింది. వారికి కొండంత ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చారు. బాలుచిస్థాన్ ప్రజలకు అండగా భారత దేశం అండగా ఉంటుందనే సందేశాన్ని మోడీ పంపించారు. దాంతో ఇప్పుడు బాలుచిస్థాన్ ప్రజలు మరింత గట్టిగా తమ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి సిద్దం అయ్యారు. అందులో భాగంగా అమెరికా, ఐరోపా దేశాల మద్దతును కోరారు. బాలుచిస్థాన్ నుండి పాకిస్థాన్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని చేస్తున్న ఆందోళనలను ఉదృతం చేశారు. బాలుచిస్థాన్ ను పాకిస్థాన్ ఆక్రమించుకున్నాడని, 68 సంవత్సరాలుగా యుద్ద నేరాలకు, అమానుష చర్యలకు పాల్పడుతున్నదని, పాకిస్థాన్ వ్యతిరేక పోరాటానికి మోడీ మాదిరిగానే మద్దతు ఇవ్వండని బలూచ్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు బుట్గి కోరారు. ఈ సందర్భంగా మద్దతు ప్రకటించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply