కాన్పూర్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం..

ఒరిస్సా ప్రభుత్వాసుపత్రి ఘటన మరచిపోక ముందే కాన్పూర్ లో మరో హృదయ విచారకర ఘటన జరిగింది. కాన్పూర్ ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బాలుడు అత్యంత దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. కాన్పూర్ కు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి తన కొడుకు అంశ్ (12) తీవ్ర జ్వరంతో బాధ పడుతుండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ చికిత్స అందుబాటులో లేక పోవడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రైన లాల లజపతి రాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ సిబ్బంది చికిత్స అందించక పోగా కనీసం పిల్లల వార్డుకు తీసుకెళ్ళేందుకు స్త్రే చర్ కూడా ఇవ్వలేదు. దాంతో సునీల్ కుమార్ కొడుకును భుజాలపై ఎత్తుకొని 250 మీటర్ల దూరంలో ఉన్న పిల్లల వార్డుకు వెళ్తుంటే మార్గ మధ్యలోనే అంశ్ తన తండ్రి భుజాలపై కన్ను మూశాడు. ఈ సంఘటన అక్కడున్న వారందరిని కలచి వేసింది.

Leave a Reply