ఫేస్ బుక్ కు షాక్ ఇచ్చిన పోలీసులు..

ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక పేస్ బుక్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన 68 లక్షల డాలర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది. ఇక వివరాలలోకి వెళ్తే పేస్ బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్ ద్వారా ఓ అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా సంస్థ సంప్రదింపులు జరిపిందని, అందుకు సంబంధించిన వివరాలు, మెసేజ్ లు ఇవ్వాలని వాట్సాప్ ను పోలీసులు కోరారు. అందుకు వాట్సాప్ యాజమాన్యం ససేమీరా అన్నారు. పోలీసులు నోటిసులు ఇచ్చినా పెద్దగా స్పందన రాలేదు. గత నెలలో వాట్సాప్ ను పూర్తిగా నిషేధించినా కూడా యాజమాన్యం వివరాలు ఇవ్వలేదు. దాంతో పోలీసులు చేసేదేం లేక పేస్ బుక్ సంస్థకు చెందిన 68 లక్షల రూపాయల డాలర్లను ఫ్రీజ్ చేశారు.

Leave a Reply