తీవ్ర నష్టాల్లో ఐటి సంస్థలు

యురోపియన్ యూనియన్ బ్రిటన్ వైదొలగాలని తీసుకున్న నిర్ణయం భారత స్టాక్ మార్కెట్ ను కుదిపేసింది. ఫలితాలు వచ్చినప్పటి నుండి స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టాలు చూసింది. ముఖ్యంగా ఐటి సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ లో ఐటి ఇండెక్స్ నాలుగు శాతం నష్టపొయింది . ప్రముఖ ఐటి కంపెనీ కంపెనీలైన టెక్ మహీంద్రా ఏడు శాతం మేర,హెచ్ సి ఎల్ ఆరు శాతం,  ఇన్ఫోసిస్,విప్రో, టీ సీ ఎస్ కంపెనీలు 3 నుండి 6 శాతం మేర నష్టాలు చవి చూశాయి. ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఐటి విశ్లేషకులు మాత్రం అతి త్వరలోనే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply