ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధికంగా ప్రకంపనలు..

యురోపియన్లో యూనియన్ లో కొనసాగాలా వద్దా అనే అంశంపై బ్రిటన్ లో నిర్వహించిన రేఫరెండంలో మెజారిటీ ప్రజలు ఈయూ నుండి బ్రిటన్ వైదోలగాలని కోరుకోవడంతో బ్రిటన్ ఈయూ నుండి 43 సంవత్సరాల తర్వాత తప్పుకొంది. అభిప్రాయ సేకరణలో 52 మంది ప్రజలు ఈయూ నుండి వైదొలగాలని కోరగా, 48 శాతం ప్రజలు ఈయూ లోనే కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ఈయూలోనే కొనసాగుదామని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ విస్తృతంగా ప్రచారం చేసినా, మెజారిటీ ప్రజలు మాత్రం ఆయన విన్నపాన్ని పట్టించుకోలేదు. దాంతో ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. యూరోపియన్ యూనియన్ లో అత్యంత పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థ కలిగిన బ్రిటన్ వైదొలగడంతో ఇప్పుడు ఈయూ మనుగడే ప్రశ్నార్థకమైనది. అంతే కాకుండా అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. మరోసారి ప్రపంచం తీవ్ర ఆర్ధిక మాంద్యాన్నిఎదుర్కునే అవకాశం ఉంది.

Leave a Reply