ప్రధాని పర్యటన తర్వాత కూడా మారని కేంద్రం తీరు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు ఆ చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల్లో అభివృద్దికి నోచుకోని ప్రాంతాలు చాలా ఉన్నాయి.వెనుకబడిన ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అయితే ఈ విషయంలో చాలా మేరకు ఆంధ్ర ప్రదేశ్ కు తెలంగాణ కు పూర్తి విభిన్నంగా నిధుల పంపిణీ జరుగుతూ వచ్చింది. 2014-15 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి  ప్రతిఏటా ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. ఆ లెక్కన ఇప్పటివరకు మూడు విడుతలుగా ఏడు జిల్లాలకు రూ. 1050 కోట్లను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.అయితే ఇదే ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే నిధుల కేటాయింపు జరిగింది.ఆంధ్ర ప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు కూడా ఇదే నిష్పత్తి ప్రకారం కేంద్రం నిధులు ఇవ్వాల్సినప్పటికి ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే నిధులు కేటాయించింది.తొమ్మిది జిల్లాలకు కలిపి రూ. 450 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వర్షం కురిపిస్తున్న కేంద్రం తెలంగాణపై మాత్రం నిర్లక్ష వైఖరి కొనసాగిస్తుందని రాష్ట్ర అధికారపక్షం ప్రశ్నిస్తుంది.ప్రధాని మోది పర్యటన తర్వాతైనా కేంద్రం తీరు మారుతుందేమో అనుకుంటే అలా జరగలేదు.

Leave a Reply