ఈ హీరోలకు ఏమైంది..?

ఈ మధ్య తరచుగా హీరోలు నోరు జారుతున్నారు. ముఖ్యంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి అనవసర వివాదాలు సృష్టిస్తున్నారు. మొన్న బాలకృష్ణ నేడు సల్మాన్ ఖాన్. బాలకృష్ణ ఒక ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ, అమ్మాయికి ముద్దు అయిన పెట్టాలి లేదా కుడుపైనా చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం సమిసి పోకముందే మరోసారి తాను ఎక్కని ఎత్తులు లేవు దిగని లోతులు లేవు అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సందర్భాలలో బాలకృష్ణ అభిమానులను ఉత్సాహా పరచడానికే మాట్లాడి ఉండొచ్చు, కాని మహిళా సంఘాల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దాంతో బాలకృష్ణ అసెంబ్లీలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ వివాదాన్ని మరచి పోకముందే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరో వివాదాన్ని తెర లేపారు.ప్రస్తుతం తాను నటిస్తున్న సుల్తాన్ షూటింగ్ తరువాత తన పరిస్థితి రేప్ కు గురయ్యిన అమ్మాయిలాగ తన పరిస్థితి ఉంటుందని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి కలకలం రేపాడు. సినిమాలో తాను పడుతున్న కష్టం గురుంచి అభిమానులకు తెలియజేసే విషయం సల్మాన్ ఖాన్ తీసుకున్న ఉదాహరణకు మహిళా సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఏమైనా ఎంతోమంది అభిమానులను కలిగి, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడాల్సింది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply