ఆలయాలను అభివృద్ధి చేద్దామన్న ఆలోచనే రాలేదు వారికి…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా గొందిమల్లలో పుష్కర స్నానం చేశారు. అనంతరం శక్తి పీఠమైన ఆలంపూర్ జోగుళాంబ దేవిని దర్శించుకున్నారు..ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ పుష్కర స్నానం చేసిన తర్వాత జోగుళాంబ దేవిని దర్శించుకోవడం అదృష్టం అని, అమ్మ వారి దయతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడి, ప్రాజెక్టులు నిండి, రైతులు సుభిక్షముగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని కేసీఆర్ వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులకు జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదని, ప్రతి సంవత్సరం 5-10 వేల మంది ఉపాసకులు ఆలంపూర్ వచ్చి వెళ్తుంటారని ప్రధానితో మాట్లాడి జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సమైక్య పాలనలో గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడ అనే విధంగా చేశారని వ్యాఖ్యానించారు. పక్కనే గోదావరి, కృష్ణా నది పారుతున్న పుష్కర స్నానాల కోసం రాజమండ్రి, విజయవాడ వెళ్ళేటట్లు చేశారని విమర్శించారు.

Leave a Reply