మతోన్మాద శక్తులను పెంచుతున్నారు..

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద శక్తులను పెంచి పోషిస్తుందని, దేశంలో దళితులపై దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, ప్రజల పక్షాన పోరాడే పార్టీలను అన్నింటిని ఏకం చేస్తామని తెలిపారు.

గత పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన విధానాలనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తుందని, కొత్త విధానాలతో ఆలోచనలతో కొత్త రాష్ట్రం ముందుకు పోవాలని ఏచూరి సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు విద్య, వైద్యం అందించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరయ్యారు.

Leave a Reply