దావూద్ గ్యాంగ్ ప్రణాళికలు వెల్లడించిన ఎన్ఐఏ అధికారులు..

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం దేశంలో కల్లోలం సృష్టించడానికి పెద్ద స్కెచ్ వేశాడు. ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ధృవీకరించింది. ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2002 గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా దేశంలో మత కల్లోలం సృష్టించడానికి దావూద్ గ్యాంగ్ సిద్దం అయినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అందుకోసం హిందూ నాయకులను హత్య చేయడం, చర్చిలపై మద్యం బాటిళ్ళతో దాడి చేయడం ద్వారా మత కల్లోలాలను సృష్టించాలని డీ గ్యాంగ్ ప్రణాళికలు వేసినట్లు ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. అందుకోసం యువతకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారని తెలిపారు. కరాచీ, దక్షిణాఫ్రికా కేంద్రాలుగా దావూద్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

Leave a Reply