రియో ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన భారత జిమ్నాస్ట్..

రియో ఒలింపిక్స్ మొదలై రెండు రోజులు గడుస్తున్న భారత క్రీడాకారుల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఖచ్చితంగా పథకం సాదిస్తారనుకున్న వారు నిరాశ పరచగా, ఏ మాత్రం అంచనాలు లేని 22 సంవత్సరాల అమ్మాయి ఒలింపిక్స్ లో అధ్బుతంగా రాణిస్తుంది. రియో ఒలింపిక్స్ లో భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్ గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ ఇప్పుడు ఏకంగా రియో ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరుకొని కొత్త చరిత్ర సృష్టించి పతకంపై ఆశలు రేపుతుంది. వాల్ట్ విభాగంలో ఫైనల్ కు చేరిన దీపా 14.850 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. తొలి ఎనిమిది మంది ఫైనల్ కు అర్హత సాధిస్తారు. ఈ నెల 14న జరిగే ఫైనల్ లో ఆమె పోటి పడనుంది. ఇప్పటికే అంచనాలకు మించి రాణిస్తున్న దీపా మరింత మెరుగ్గా రాణిస్తే ఐదు దశాబ్దాలుగా జిమ్నాస్ట్ లో ఊరిస్తున్న పతకం కల తీరినట్లే.

Leave a Reply