రియో ఒలింపిక్స్ లో సంచలనం..

రియో ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో సంచలనం నమోదయింది. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ తొలి రౌండ్ లోనే ఓటమి పాలయ్యారు. ఇప్పటికే కేరీర్ స్లామ్ పూర్తి చేసుకొని, ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి గోల్డెన్ స్లామ్ పూర్తి చేసుకోవాలని కలగన్న జకోవిచ్ తొలి రౌండ్ లోనే ఓటమి పాలవ్వడం ఆయన అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేసింది.అర్జెంటీనా  ఆటగాడు డెల్ పాత్రో చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. హోరాహోరిగా జరిగిన పోరులో 7-6,7-6 తేడాతో డెల్ పాత్రో విజయం సాధించారు. గత ఒలింపిక్స్ లో కాంస్యం కోసం జరిగిన పోరులో డెల్ పాత్రో చేతిలో ఓడిన జకోవిచ్ ఇప్పుడు తొలి రౌండ్ లోనే ఓడిపోవడం గమనార్హం. గోల్డెన్ స్లామ్ గెలుచుకోవాలనుకుంటున్న జకోవిచ్ మరో నాలుగేళ్ళు వేచి చూడక తప్పదు. కాగా ఓటమి అనంతరం జకోవిచ్ మైదానంలోనే తీవ్రంగా ఏడవడం అక్కడ ఉన్న వారినందరినీ కలచి వేసింది. కాగా పురుషుల డబుల్స్ విభాగంలో తన సహచర ఆటగాడు జిమోంజిక్ తో జత కట్టిన జకోవిచ్ రెండో రౌండ్ లోకి దూసుకెళ్ళారు.

Leave a Reply