సొంత పార్టీ నేతల నుండే పెరుగుతున్న వ్యతిరేకత..

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నరియల్ ఎస్టేట్ వ్యాపారి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్నది. ఆయనకు సొంత పార్టీ నేతల నుండే తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతున్నది.తాజాగా రిపబ్లికన్ నేషనల్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ బృందానికి చెందిన 50 మంది ట్రంప్ కు  వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి అనర్హుడని, ఒకవేళ ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే దేశ చరిత్రలోనే అత్యంత మొరటు అధ్యక్షుడిగా నిలిచిపోతారని విమర్శించారు. ట్రంప్‌లో ప్రమాదకర లక్షణాలున్నాయని, నైతిక విలువలు లేవని,  సరైన వ్యక్తిత్వం లేదని, స్వీయ నియంత్రణ లేదని ఆరోపించారు. ఆయన ఒక వేళ అధ్యక్షుడైతే గనుక ప్రస్తుతం ఎంతో సురక్షితంగా ఉన్న అమెరికా అణు ఆయుధ సంపత్తి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఈ 50 మంది బృందంలో ఇం టెలిజెన్స్ డైరెక్టర్స్, మాజీ భద్రత అధిపతులు, సీనియర్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్స్ మొదలైన వారు ఉన్నారు. బృందంలోని వారంతా తమ సంతకాలతో కూడిన లేఖను బహిరంగంగా విడుదల చేశారు.

Leave a Reply