లీకైన తెలంగాణ ఎంసెట్ – 2 పేపర్..

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా రెండు సార్లు ఎంసెట్ పేపర్ లను నిర్వహించారు. మొదట ఒకే పేపర్ గా నిర్వాహిద్దామనుకున్నప్పటికి నిట్ వల్ల ఏర్పడ్డ గందరగోళంతో మెడికల్ పరీక్షను రెండవ సారి నిర్వహించాల్సి వచ్చింది.అయితే కొంతమంది తెలంగాణ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ పరీక్షను కూడా రాశారు. వారిలో కొంతమందికి వేలల్లో ర్యాంకులు వచ్చాయి. వారు తిరిగి తెలంగాణ ఎంసెట్ రాస్తే పదుల్లో ర్యాంక్ లు వచ్చాయి. దాంతో విచారించిన సీఐడీ అధికారులు విస్తూపోయే నిజాలను భయటికీ వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 5 గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో విద్యార్థి నుండి 10 లక్షల రూపాయలను తీసుకొని, పరీక్షకు రెండు రోజుల ముందు ప్రశ్నా పత్రం లీక్ చేసి, వారిని బెంగుళూరులో చదివిన్చినట్లు తెలిసింది. మొత్తం 15 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు.

Leave a Reply